
హైదరాబాద్: (శ్రీరామ్ చక్రి న్యూస్ ) టుడే న్యూస్ 24/6/2026 మహేశ్వరం నియోజకవర్గంలోని జీహెచ్ఎంసీ మీర్ పేట్ పరిధిలో మీర్ పేట్ నుంచి జిల్లెలగూడకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారిందని బీజేపీ మీర్ పేట్ అధ్యక్షుడు తులసి ముకేష్ ముదిరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు.వర్షాకాలం ప్రారంభం కావడంతో పాటు పాఠశాలలు కూడా ప్రారంభమైన నేపథ్యంలో రోజూ ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధాన రహదారి అంతా గుంతలతో నిండిపోయి ఉండటంతో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచి వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోందన్నారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి మీర్ పేట్–జిల్లెలగూడ ప్రధాన రహదారితో పాటు మీర్ పేట్ ప్రాంతంలోని ఇతర దెబ్బతిన్న రహదారులపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని ఆయన కోరారు. అలాగే వర్షపు నీరు నిల్వ కాకుండా తగిన డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధికారులు అత్యవసరంగా పరిష్కరించి రహదారులను ప్రయాణానికి అనుకూలంగా మార్చాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేశారు.

