ఉమ్మడి పాలమూరు జిల్లా వ రప్రసాయని అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తి పోతల పథకాన్ని చేపట్టకపోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేసిన హెచ్చరికతో సర్కారు దిగొచ్చింది.

పాల మూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సమీక్ష చేపట్టి పెండింగ్ పనులను ఏడాదిలోగా పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు ప్రకటించిన సర్కారు ఆ తర్వాత వెంటనే మాట మార్చి ఉమ్మడి జిల్లాలోని ఇతర ప్రాజెక్టులను కూడా సమీక్షిస్తారని ప్రకటించ డంతో ఈ అనుమానాలకు బలం చేకూరు తోం ది. ఇందుకు నిదర్శనంగా ముందుగా సీఎం రేవంత్‌రెడ్డి నేరుగా మక్తల్‌కు చేరుకొని నా రాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథ కాన్ని పరిశీలించి అక్కడే ఉన్నత స్థాయి సమీక్ష చేపడుతున్నారు.
