ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానపై ప్రజలకు నమ్మ కం పెంచేలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

వరంగల్చౌరస్తా, జూన్ 3: ఉత్తర తెలంగాణ ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం దవాఖానపై ప్రజలకు నమ్మ కం పెంచేలా పనిచేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో ఎంజీఎంహెచ్ కాన్ఫరెన్స్ హాల్లో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ కడి యం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డితో కలిసి మంత్రి సురేఖ ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధికి అవసరమైన చర్యలపై చర్చించారు.
