వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు త్వరలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది.

న్యూఢిల్లీ: వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు త్వరలో ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. త్వరలోనే ఇథనాల్ ఆధారిత వంట పొయ్యిని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రెయిన్ ఇథనాల్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (జీఈఎంఏ) ప్రెసిడెంట్ సీకే జైన్ మాట్లాడుతూ.. ఇథనాల్ తయారీదారులు వాణిజ్య అవసరాల కోసం ఈ వంట పొయ్యిపై పని చేస్తున్నారని, దీనికి సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించారని తెలిపారు. పంపిణీ, రీఫిల్లింగ్ వంటి కొన్ని ప్రారంభ సవాళ్లు ఉన్నాయని, వాటిపై ప్రస్తుతం పని జరుగుతున్నదని, అవి పరిష్కారం అయిన తర్వాత వాణిజ్యపరంగా దీనిని ఉపయోగించడం ప్రారంభించవచ్చని అన్నారు.
