తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ ధైర్యానికి, సంకల్పానికి, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిందన్నారు.

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. 2014జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో గ్రీటింగ్స్ చెబుతూ.. తెలంగాణ ప్రజలు తమ సృజనాత్మకతకు, వ్యాపార దృక్పథానికి ప్రసిద్ధులు అని పేర్కొన్నారు.
