ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై మంగళవారం రాత్రి రష్యా మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది.

కీవ్: మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మంగళవారం రాత్రి రష్యా దాడి(Russia Attack) చేసింది. కీవ్‌తో పాటు పలు నగరాలపై దాడులు జరిగాయి. ఆ దాడుల్లో సుమారు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 29 మంది గాయపడినట్లు సమాచారం ఉంది. కీవ్‌లో రెసిడెన్షియల్ బిల్డింగ్లు డ్యామేజ్ అయ్యాయి. కొన్ని పాక్షికంగా కూలిపోయాయి. దీంతో ఆ శిథిలాల్లో స్థానికులు చిక్కుకున్నారు. కీవ్‌లో అనేక జిల్లాలో ఆ దాడులు ప్రభావం చూపినట్లు సైనిక అధికారి తైముర్ తాచెంకో తెలిపారు. దిన్ప్రోలో అయిదుగురు మృతిచెందారు. అక్కడ 25 మంది గాయపడ్డారు.
