రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మక్క, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి సంఘీభావం తెలిపారు.

తొగుట,జూన్ 1: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మక్క, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి సంఘీభావం తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం వరి,మక్క ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు.
