కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ రహదారిపై వరి ధాన్యం బస్తా రోడ్డుపై వేసి తగలబెట్టారు. అనంతరం బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.

టేక్మాల్, జూన్ 1 : కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ రహదారిపై వరి ధాన్యం బస్తా రోడ్డుపై వేసి తగలబెట్టారు. అనంతరం బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. సకాలంలో తూకం వేయక, తూకం వేసిన ధాన్యాన్ని మిల్లర్లు తరలించకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిపోయిందన్నారు.
