వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రైతు తక్కళ్లపెల్లి లోకేశ్వర్‌రావు ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో మూడేళ్ల క్రితం ఆయిల్‌పామ్ మొక్కలు నాటాడు. డ్రిప్ ఏర్పాటు చేసుకొని నీరు, ఎరువులు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి.

వర్ధన్నపేట, మే 29 : ఓ రైతు మూడేళ్ల కష్టం అగ్గిపాలైంది. మరో ఏడాది ఇలాగే కాపాడుకుంటే తొలిపంట చేతికొస్తుందన్న ఆనందం ఆవిరైపోయింది. పంటల అవశేషాలను కాల్చేందుకు పెట్టిన మంట తీరని నష్టాన్ని మిగిల్చింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన రైతు తక్కళ్లపెల్లి లోకేశ్వర్‌రావు ఇల్లంద శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద తనకున్న ఎనిమిది ఎకరాల భూమిలో మూడేళ్ల క్రితం ఆయిల్‌పామ్ మొక్కలు నాటాడు. డ్రిప్ ఏర్పాటు చేసుకొని నీరు, ఎరువులు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. మొక్కలు ఏపుగా పెరిగాయి.
