ఈదురు గాలులతో కూడిన వాన దంచికొట్టింది. శుక్రవారం 5:30 గంటలకు మొదలైన వాన 2గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

అయిజ, మే 29 : ఈదురు గాలులతో కూడిన వాన దంచికొట్టింది. శుక్రవారం 5:30 గంటలకు మొదలైన వాన 2గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో మున్సిపాలిటీలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయిజ మున్సిపాలిటీలోని పలు కాలనీలు వర్షం నీటితో నిండిపోయాయి. రాయిచూర్ రహదారిలోని ఓ కాలనీ వరద నీటితో ముంచెత్తింది. బుడగ జంగాల కాలనీకి చెందిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాయిచూర్ రహదారిపై ఉన్న కల్వర్టు ఆక్రమణకు గురై మూసుకుపోవడంతో వాన నీరు వాగులు, వంకలకు చేరకుండా అక్కడే నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీల్లో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
