అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్‌పై దాడి చేశాయి. ఇరానీ మిలిటరీ కేంద్రంపై అటాక్ చేశారు. డ్రోన్లను కూల్చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ప్రమాదకరంగా మారిన సుమారు నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు పేర్కొన్నాయి.

న్యూయార్క్: అమెరికా దళాలు బుధవారం మరోసారి ఇరాన్‌పై దాడి(US Strikes) చేశాయి. ఇరానీ మిలిటరీ కేంద్రంపై అటాక్ చేశారు. డ్రోన్లను కూల్చేశారు. హోర్ముజ్ జలసంధి వద్ద ప్రమాదకరంగా మారిన సుమారు నాలుగు డ్రోన్లను కూల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ దళాలు పేర్కొన్నాయి. బందర్ అబ్బాస్‌లో ఉన్న గ్రౌండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా అమెరికా దళాలు పేల్చేశాయి. డ్రోన్‌ను ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ కంట్రోల్ స్టేషన్‌ను పేల్చారు. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి
