కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శుకవారం బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.

అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీ నం చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు దొడ్డిదారిన సంస్థను నిర్వీర్యం చేసే చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా ఆర్టీసీపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవీఎంల పేరిట డ్రైవర్లుగా స్థానిక ఉద్యోగులను కాకుండా, ఇతర రాష్ర్టాల వారిని నియమిస్తున్నారని మండిపడ్డారు
