క్రాప్ లోన్ రెన్యువల్ కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు

ధర్మసాగర్ : క్రాప్ లోన్ రెన్యువల్ కోసం అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. బ్యాంకుల పెట్టే షరతులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు యూరియా బుకింగ్ కోసం, ఇటు పంటలు కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్న రైతులకు బ్యాంకులతోనూ తిప్పలు తప్పడం లేదు. తాము తీసుకున్న క్రాప్ లోన్ రెన్యువల్ కోసం బ్యాంకులకు వెళ్తే అసలు, వడ్డీ కలిపి చెల్లించాలంటున్నారు. దీంతో సమయానికి డబ్బులు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ సకాలంలో లోన్ రెన్యువల్ చేసుకోకపోతే కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీని కోల్పోతున్నారు.
