అమెరికాలో ఐదేళ్ల బాలుడిని అమెరికా వలసల శాఖ అధికారులు అదుపులోకి తీసుకోవడం కలకలానికి దారి తీసింది.

అమెరికా ;అమెరికావలసల శాఖ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. మిన్నెసొటాలో మంగళవారం అక్రమ వలసదారుడు ఏడ్రియన్ అలెగ్జాండర్ ఆరియాస్తో పాటు అతడి ఐదేళ్ల తనయుడు లియమ్ను కూడా ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా మండిపడ్డారు. కుటుంబంతో ఉండాల్సిన ఐదేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకోవడం తప్పంటూ నెట్టింట ఆగ్రహం వ్యక్తం చేశారు .
