మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

హైదరాబాద్ : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సంస్థాన్ నారాయణపూర్లో రాజగోపాల్ రెడ్డి అనుచరులు మూసివేసిన వైన్ షాపులను అధికారులు దగ్గరుండి తెరిపించారు. ఎక్సైజ్ శాఖ అధికారుల పహారాలో ఉదయం నుండి మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.
కాగా, మా సార్ చెప్పిన టైంకే వైన్ షాపులు తెరవాలి. లేదంటే షాపులు మొత్తానికి మూసేస్తాం అని మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే.
