బడంగ్పేట్ను జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. అన్ని పార్టీల నాయకులు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

బడంగ్పేట్, జనవరి 12: బడంగ్పేట్ను జోనల్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజుకు బలపడుతోంది. అన్ని పార్టీల నాయకులు వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. బడంగ్పేట్ను జోనల్ కార్యాలయం చేయకుండా శంషాబాద్లో విలీనం చేయడాన్ని బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ పార్టీలతో పాటు అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డివిజన్ల ఏర్పాటు అస్తవ్యస్తంగా చేయడమే కాకుండా జోనల్ విషయంలో ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిందని వా రు ఆగ్రహంగా ఉన్నారు. శంషాబాద్ జోన్ లో బడంగ్పేట్ విలీనాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
