యువత రాజకీయాల్లో చేరి తనదైన పాత్ర పోషించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు.

కోరుట్ల, జనవరి 13: యువత రాజకీయాల్లో చేరి తనదైన పాత్ర పోషించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 24 వ వార్డు బీఆర్ఎస్ నాయకులు నీలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో 50 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువకులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన నిరూపించిందని పేర్కొన్నారు.
