విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, రైతులకు విద్యుత్ పరంగా ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ రావు అన్నారు.

రాయపోల్ జనవరి 13 : గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని, రైతులకు విద్యుత్ పరంగా ఎలాంటి సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాస్ రావు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని ఆయా గ్రామాల్లో విద్యుత్ సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత లైన్ మెన్, హెల్పర్లకు, విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలని, రైతులు ఎవరికి వారు సొంత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ట్రాన్స్ఫార్మర్ల వద్ద రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
