వారంతా రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు. కష్టం వస్తే తల్లీ నీవే దిక్కని ఆ తల్లులపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ వన దేవతల జాతరే వారి పాలిట ఇబ్బందికరంగా మారింది.వారంతా రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు. కష్టం వస్తే తల్లీ నీవే దిక్కని ఆ తల్లులపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ వన దేవతల జాతరే వారి పాలిట ఇబ్బందికరంగా మారింది.

స్టేషన్ ఘనపూర్, డిసెంబర్ 31 : వారంతా రెక్కాడితేగాని డొక్కాడని బడుగు జీవులు. బుక్కెడు బువ్వ, గుక్కెడు నీళ్ల కోసం ఏరోజుకు ఆరోజు బతుకు దెరువు కోసం పోరాడే చిరు వ్యాపారులు వాళ్లు. కష్టం వస్తే తల్లీ నీవే దిక్కని ఆ తల్లులపై భారం వేసి కాలం వెళ్లదీస్తుంటారు. కానీ, ఇప్పుడు ఆ వన దేవతల జాతరే వారి పాలిట ఇబ్బందికరంగా మారింది. రెండేళ్లకోసారి ప్రకృతి మధ్యన ఆహ్లాదకర వాతావరణంలో పంచభూతాల సాక్షిగా సమ్మక్క-సారలమ్మలను కుటుంబమంతా ఆ వనదేవతలను దర్శించుకుని వారికి ఇష్టమైన బంగారం (బెల్లం) సమర్పిస్తారు.
