నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు భారీగా యువత తరలివచ్చే అవకాశం ఉంది.

కొల్లాపూర్: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న సోమశిల కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమైంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు భారీగా యువత తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో అదే స్థాయిలో వారికి తగ్గట్లుగా మద్యం నిల్వ చేసినట్లుగా పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పర్యాటక శాఖకు చెందిన కాటేజీలను లీజుకు తీసుకున్న మృగవాని సంస్థ కూడా బుధవారం రాత్రి న్యూ ఇయర్ సెలబ్రేషన్ష్ కోసం భారీ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
