కరీంనగర్ జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు.

చిగురుమామిడి, డిసెంబర్ 30 : జిల్లావ్యాప్తంగా గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ లింగారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పీచుపల్లి గ్రామంలో గొర్రెలు మేకలకు నట్టల నివారణ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లా వ్యాప్తంగా 5. 20 లక్షల గొర్రెలు, మేకలు ఉన్నాయన్నారు. అందులో భాగంగా ఇప్పటివరకు 4 లక్షలకు పైగా మందులను పంపిణీ చేశామన్నారు.
