పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు.

పశ్చిమ బెంగాల్ లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ప్రభుత్వం అవినీతి, భయం, చొరబాట్లతో బెంగాల్ నిండిపోయిందని.. ఇది రాష్ట్ర భద్రతకు తీవ్ర ముప్పు కలిగిస్తోందని ఆరోపించారు.
కోల్కతా లో విలేకరుల సమావేశంలో షా మాట్లాడుతూ.. 15 ఏండ్ల తృణమూల్ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ‘గత 15 ఏండ్లుగా బెంగాల్ భయం, అవినీతి, దుష్పరిపాలనను చూసింది. చొరబాట్లు ప్రజల్లో అభద్రతా భావాన్ని, ఆందోళనను సృష్టించాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది’ అని షా వ్యాఖ్యానించారు.
