అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ అదే విషయాన్ని చెప్పారు. ఇండోపాక్ సమరాన్ని ఆపినట్లు పేర్కొన్నారు. ఈసారి ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూతో వెల్లడించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయన 70 సార్లు చెప్పినట్లు తెలుస్తోంది.

న్యూయార్క్: ఇండోపాక్ వార్‌ను ఆపినట్లు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూతో జరిగిన మీటింగ్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఫ్లోరిడాలోని మార్ ఏ లాగో పామ్‌బీచ్‌లో ట్రంప్‌తో నెతన్యూ భేటీ అయ్యారు. రెండోసారి వైట్‌హౌజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఇప్పటి వరకు 8 యుద్ధాలను నివారించినట్లు ట్రంప్ తెలిపారు. ఆర్మేనియా, అజర్బైజాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని, టారిఫ్‌లతో ఆ రెండు దేశాలను బెదిరించినట్లు చెప్పారు. కానీ తనకు అనుకున్నంత క్రెడిట్ దక్కలేదన్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఫైటింగ్‌ను కూడా ఆపినట్లు ట్రంప్ వెల్లడించారు.
