సోమవారం మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల మేనేజర్లు, ట్రాఫిక్, గ్యారేజీ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో జాతర సమయంలో ఏయే ప్రాంతాల నుంచి ఎన్నెన్ని బస్సులు నడిపామో, అప్పుడు ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా అన్న అంశాలపై ఆయన చర్చించారు.

ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల నుంచి మొత్తం 369 బస్సులను నడుపాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఇందులో చెన్నూరు బస్టాండు నుంచి 70, బెల్లంపల్లి నుంచి 89, శ్రీరాంపూర్ నుంచి 45, మందమర్రి నుంచి 50, మంచిర్యాల నుంచి 115 బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నట్లు ప్రకటించారు. మహిళలకు మహాలక్ష్మీ పథకం వర్తిస్తుందని తెలిపారు. జాతరకు వెళ్లే ప్రయాణికులను సురక్షితంగా, సుఖవంతంగా చేర్చడమే సంస్థ ప్రధాన లక్ష్యమని, ఇందుకోసం అధికారులు, సిబ్బంది అంతా జాతర జరిగే రోజుల్లో నిరంతరం పనిచేయాల్సి ఉంటుందన్నారు.
