
డిసెంబర్ 29 (శ్రీరామ్ చక్రి న్యూస్)రంగారెడ్డి జిల్లా, బాలాపూర్:అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బెంగళూరు నుంచి మాదకద్రవ్యమైన MDMA ను తీసుకువచ్చి బాలాపూర్ ప్రాంతంలో విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలాపూర్ పోలీసుల వివరాల ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నాగిడి జానకి శ్రీరామ్ హైదరాబాదులోని కొండాపూర్ ప్రాంతంలో నివసిస్తూ, బెంగళూరుకు చెందిన తన స్నేహితుడు కౌశల్ ద్వారా MDMA మాదకద్రవ్యాన్ని తెప్పించుకున్నాడు. అనంతరం మరో స్నేహితుడు విశ్వా సహకారంతో బాలాపూర్ పరిధిలో విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి నిర్వహించారు.ఈ దాడిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని వద్ద నుండి 1.6 గ్రాముల MDMA మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి ఇంకా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టినట్లు బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు.
