మత్స్యకారుల సంక్షేమం మత్స్య పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు పొందేలా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

మత్స్యకారులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెన్నారావుపేట వరంగల్ జిల్లా మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు హంస విజయరామరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా చెన్నారావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ముదిరాజ్లు అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని తెలిపారు.
