మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు (Premsagar Rao) సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పీఏ శ్రీధర్ వెల్లడించారు.

ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ వ్యవస్థపై ఫోన్లో పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారన్నారు.
