మహేశ్వరం నియోజకవర్గ నాయకుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం

హైదరాబాద్, అక్టోబర్ 14 (శ్రీరామ్ చక్రీ న్యూస్):
మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ యూసుఫ్ గారు ఎల్బీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన న్యూ రాయల్ ట్రేడర్స్ నేడు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టిపిసిసి మెంబర్ దేప భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యువత ఉపాధి కోసం ముందుకు వస్తున్న కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం అభినందనీయం” అని అన్నారు. వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని యూసుఫ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు గట్ల రవీంద్ర, MD జాంగిర్, నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

