శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి 69వ తిరునక్షత్ర ఉత్సవం సందర్భంగా

సంతోష్ నగర్, హైదరాబాద్:
శ్రీశ్రీశ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో, 2025 అక్టోబర్ 15 (బుధవారం) నాడు, శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి 69వ తిరునక్షత్ర పుట్టినరోజు సందర్భంగా మహా వైభవంగా శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించబడుతుంది.
ఈ ప్రత్యేక సందర్భంగా, చంపాపేట భగవద్గీత కవిత గారి ఆధ్వర్యంలో, సాయంత్రం 5:30 గంటల నుంచి,
100 మంది మహిళా భక్తులతో సామూహికంగా పారాయణం జరగనుంది.
ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే మహిళలు పసుపు చీరలు ధరించి, తిరుమణి కాపురేఖ ధరించగలరని ప్రార్థన.
పారాయణంలో పాల్గొనేవారు సమయపాలన పాటించవలెను.
ఈ పారాయణ కార్యక్రమాన్ని
వికాస్ తరంగణి – సంతోష్ నగర్,
మారుతి నగర్ మహిళా బృందం చంపాపేట,
అండాల గోష్టి భగవద్బంధువులు
సహకారంతో నిర్వహించనున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్, ఫౌండర్ ట్రస్ట్ సభ్యులు,
మరియు
ముఖ్య అర్చకులు డా. నల్ల తీగ శ్రీనివాసాచార్యులు
వారి ఆహ్వానంతో
ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది.
భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీర్వాదాన్ని పొందగలరని మనవి.
జై శ్రీమన్నారాయణ!
