సిటీలో తాగునీటి మాఫియా రెచి.్చపోతున్నది. ఎక్కడ పడితే అక్కడ వేలాది అడుగుల లోతులో బోర్లను తవ్వి భూగర్భ జలాలను జలగల్లా పీలుస్తున్నారు. నాలాలు, మూసీ పరిసరాల్లో బోర్లను తవ్వి విషపూరితమైన నీటిని తోడి విక్రయిస్తున్నారు

గతంలో జలమండలి నీటిని సరఫరా చేసిన ట్యాంకర్ యజమానులు లోగోలు, పేర్లను తొలగించకుండా ప్రైవేట్‌గా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్‌పైన జలమండలి పేరు, లోగో ఉండటంతో వినియోగదారులు ఆ నీరు జలమండలి నుంచే వస్తున్నాయని అనుకుంటున్నారు. జలమండలి నుంచి వచ్చే నీళ్లు సురక్షితమని భావించి అక్రమార్కులు ఏ నీళ్లను తీసుకొచ్చినా.. ఎలాంటి అనుమానం లేకుండా కప్పిపుచ్చుతున్నారు. నగరవ్యాప్తంగా వందలాది ట్యాంకర్లు అక్రమంగా తిరుగుతున్నాయి.
