గ్యాస్ సిలిండర్ల ధరలు ఆకాశమే హద్దుగా పెరగడానికి తోడు బుక్‌చేసిన సిలిండర్లు సకాలంలో అందకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కేంద్రం తాజాగా తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం డొమస్టిక్ సిలిండర్ బుక్ చేసిన 25 రోజుల తర్వాత మరో సిలిండర్ బుక్ చేయడానికి వీలుంటుంది. కానీ చాలామంది కస్టమర్లకు 25 రోజులు గడిచి 2 నెలలు గడుస్తున్నా బుకింగ్‌కు అవకాశం ఇవ్వడం లేదంటూ వాపోతున్నారు. ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీలను సంప్రదిస్తే పైనుంచి గ్యాస్ కొరత ఉందంటూ చేతులెత్తేస్తున్నారు.
