ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది

న్యూఢిల్లీ : ఆన్ స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మరో నిర్వాకం వెలుగు చూసింది. 12వ తరగతికి ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన ఓఎస్ఎం విధానంలో అర్హత గల ఉపాధ్యాయులతో కాకుండా 10వ తరగతి టీచర్లతో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారు. ఢిల్లీ పేరెంట్స్ అసోసియేషన్‌కు చెందిన అపరాజిత గౌతమ్ దీనికి సంబంధించిన పలు నిజాలను వెల్లడించారు.
