ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఎబోలా వైరస్ (Ebola Virus) విజృంభిస్తున్నది. ఈ క్రమంలో ఎబోలా సోకిన 11 మంది పేషెంట్లు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారవడం ఆందోళనలు రేకెత్తించింది.

Ebola Patients : ఆఫ్రికా ఖండంలోని కాంగో దేశంలో ఎబోలా వైరస్జభిస్తున్నది. ఈ క్రమంలో ఎబోలా సోకిన 11 మంది పేషెంట్లు ఐసోలేషన్ కేంద్రాల నుంచి పరారవడం ఆందోళనలు రేకెత్తించింది. ఇదిలావుంటే ఎబోలా వ్యాధితో మృతిచెందిన వారిని ఖననం చేసే బృందం (Burial Team) పై కటానా పట్టణంలో మూక దాడి జరిగింది. దక్షిణ కివులోని కటానా పట్టణంలో ఎబోలాతో చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు చేస్తున్న బృందంపై కొందరు మూక దాడి చేశారు. దీంతో ఆ మృతదేహాన్ని అక్కడే వదిలేసి ఆ బృందం పారిపోయింది.
