
జనవరి 12( శ్రీరామ్ చక్రిన్ న్యూస్)మీర్ పేట్, GHMC: స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా, ఈరోజు మీర్ పేట్ స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఘన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్ మరియు మాజీ MPTC ఎనుగుల అనిత అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.కార్యక్రమంలో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్ విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించే సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి అందరిని మురిపెట్టారు.ముఖ్య అతిథులుగా మీర్ పేట్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి మరియు రాష్ట్ర బంజారా నాయకులు ముడావత్ దీప్ లాల్ చౌహాన్ పాల్గొని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో ఇతర ప్రముఖులు కూడా హాజరయ్యారు, వీరిలో లార్డ్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్ చైర్మన్ సిద్దాల లార్డ్స్ బీరప్ప, వైస్ చైర్మన్ బెర్ర్లు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, దోమలపల్లి ధనలక్ష్మి రాజ్ కుమార్, ఉయ్యాల నవీన్ గౌడ్, సిద్దాల పద్మ అంజయ్య, మాజీ టెంపుల్ డైరెక్టర్లు మేకల యాదగిరి, సుర్వి లత శేఖర్ గౌడ్, జ్ఞానేశ్వర్ చారి, జంగయ్య, కాంటెస్టడ్ కార్పొరేటర్లు దయానంద్ ముదిరాజ్, గోపి యాదవ్, హతిరాం నాయక్, బుచ్చిరెడ్డి రవిందర్ రెడ్డి, నాయకులు సత్యం నర్సింహా, విజయ భాస్కర్ రెడ్డి, ముద్దగోని రామకృష్ణ గౌడ్, రూప్ కరన్ ముఖ్యంగా పాల్గొన్నారు.ఈ వేడుకలు స్వామి వివేకానంద తత్త్వాలను గుర్తు చేసుకునే విధంగా, సమాజంలో జాతీయ చైతన్యాన్ని ప్రేరేపించేలా జరిగాయి.
