కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ అంగీకరించారు. గురువారం రోజున లోక్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి కి సిద్దరామయ్య తన రాజీనామాను అందజేసిన విషయం తెలిసిందే.

బెంగుళూరు: కర్నాటక సీఎం సిద్ధరామయ్య సమర్పించిన రాజీనామాను ఆ రాష్ట్ర గవర్నర్ థావర్‌చాంద్ గెహ్లాట్ అంగీకరించారు. గురువారం రోజున లోక్‌భవన్‌లో గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి కి సిద్దరామయ్య తన రాజీనామాను అందజేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం తనకున్న అధికారాల అనుసారం సీఎం సిద్దరామయ్య సమర్పించిన రాజీనామాను స్వీకరిస్తున్నట్లు గవర్నర్ థావర్‌చాంద్ తెలిపారు. సిద్దరామయ్య నేతృత్వంలో ఉన్న మంత్రిమండలిని తక్షణమే రద్దు చేస్తున్నట్లు గవర్నర్ తన నోటిఫికేషన్లో తెలిపారు.
