సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తాం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్ : సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు ఉద్యమిస్తాం అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే చేసుకోమన్న పోలీసులు ముందు రోజు రాత్రి అనుమతి నిరాకరించారన్నారు. ర్యాలీకి రాకుండా అడుగడుగునా అడ్డుకున్నారని ఆరోపించారు. భయానక వాతావరణం సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా మన నిరసన తెలపడంలో విజయవంతం అయ్యామన్నారు
