మెదక్, : మాఘ అమావాస్య సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ తెలిపారు.

మాఘ అమావాస్య విధుల నిర్వహణపై నిర్వహించిన బ్రీఫింగ్లో భాగంగా జిల్లా సిబ్బందికి ఎస్పీ కీలక సూచనలు చేశారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించాలని, క్యూ లైన్లు, బారికేడ్ల వద్ద ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జాతర నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులపై సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి జాతర మొత్తం నిరంతర నిఘాలో ఉంచినట్లు వివరించారు. భక్తులు పోలీసు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపి సహకరించాలని ఆయన కోరారు.
