వసంత పంచమి పర్వదినం సందర్భంగా తిరుమల లోని శ్రీవారి ఆలయంలో శుక్రవారం వార్షిక విశేష పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు.

తిరుమల : వసంత పంచమి పర్వదినం సందర్భంగా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శుక్రవారం వార్షిక విశేష పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా శ్రీవారి ఆలయంలోని కళ్యాణ మండపంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చతుర్దశ కలశావాహనం గావించి పుణ్యహవచనం, వివిధ క్రతువులను నిర్వహించారు
