మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్‌కు రెండు పాడి బర్రెలు ఉన్నాయి.

నర్సాపూర్: విద్యుత్ షాక్ తగిలి రెండు పాడి బర్రెలు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాజీపేటలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం కాజీపేట గ్రామానికి చెందిన పల్లె రమేశ్‌కు రెండు పాడి బర్రెలు ఉన్నాయి. వాటి నుంచి సేకరించిన పాలతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నాడు. గురువారం ఉదయం బర్రెలను మేపడానికి పొలాలకు తీసుకెళ్లాడు. అప్పటికే లూజ్ అయిన విద్యుత్ తీగలు కిందపడి ఉండడంతో అది గమనించక గేదెలు ఆ వైర్లకు తగులుకొని అక్కడికక్కడే రెండు బర్రెలు చనిపోయాయి.
