నాగర్ కర్నూర్ జిల్లా కోడేరు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిగింది.

కొల్లాపూర్ : నాగర్ కర్నూర్ జిల్లా కోడేరు మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికలకు ఫలితాలతో సంబంధం లేకుండానే రాష్ట్రంలో వచ్చేది, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేది బీఆర్ఎస్ పార్టీయే మాత్రమేనని నమ్మిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా గురువారం కోడేరు మండలం జంనుంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డి, మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు శేషి రెడ్డిల ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గులాబీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు.
