వృద్ధ వికలాంగుడికి మూడు చక్రాల వాహనాన్ని హామీ

మీర్పేట్, అక్టోబర్ 14 (శ్రీరామ్ చక్రీ న్యూస్):
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓ వృద్ధ వికలాంగుడు సహాయం కోసం ఎమ్మెల్యే శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారిని కలిశారు. తన కుటుంబ పరిస్థితులు మరియు నడవలేని స్థితిని వివరిస్తూ వాహన సహాయం కోరాడు.

ఈ విషయాన్ని సానుభూతితో విన్న ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు, వారంలోపుగా బ్యాటరీతో నడిచే మూడు చక్రాల వాహనాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. “మీకు, మీ కుటుంబానికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను” అని ఆమె భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అర్కల కామేష్ రెడ్డి, మాజీ కోఆప్షన్ మెంబర్ సయ్యద్ ఆదిల్ అలీ, పి.ఏ.సి.ఎస్ డైరెక్టర్ కాడమోని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖ నాయకుల మద్దతుతో ఈ సహాయం జరిగిందని, అవసరమైన మరిన్ని సేవల కోసం ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని ఎమ్మెల్యే కార్యాలయం వర్గాలు వెల్లడించాయి,

Supar