లెనిన్ నగర్ నివాసితుడికి రూ.18 వేల ఆర్థిక సహాయం

మహేశ్వరం, అక్టోబర్ 14 (శ్రీరామ్ చక్రి న్యూస్):
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లెనిన్ నగర్‌కు చెందిన హారిక తండ్రి సత్యనారాయణ రెడ్డికు వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ.18,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కును మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం అందజేశారు.

వైద్య అవసరాలకు ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉండే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగపడుతోందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చెక్కును అందుకున్న కుటుంబం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో
మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ అర్కల కామేష్ రెడ్డి,
దిండు భూపేష్ గౌడ్, శీను నాయక్, సిద్దాల బీరప్ప,
సునీత బాలరాజ్, పంతంగి మాధవి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి
తదితరులు పాల్గొన్నారు.