సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని వల్భాపూర్ గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మండలంలోని వల్భాపూర్ గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ ముగ్గుల పోటీల్లో మొత్తం 46 మంది పాల్గొనగా సంక్రాంతి పండుగ ప్రతిభింబించేలా అందంగా ముగ్గులు వేసిన మారముళ్ల మహాలక్ష్మి మొదటి బహుమతి, నలుబాల తేజస్వీ రెండో బహుమతి, మారముళ్ల రాజేశ్వరీ మూడో బహుమతి పొందారని, ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మిగతా 43 మంది కన్సోలేషన్ బహుమతులు అందజేశామని నిర్వాహకులు తెలియజేశారు.
