వానకాలం వస్తున్నదంటే నగర వాసులు వణికిపోతున్నారు. వరంగల్ లోతట్టు ప్రాంతా ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వరంగల్, జూన్ 3 : వానకాలం వస్తున్నదంటే నగర వాసులు వణికిపోతున్నారు. వరంగల్ లోతట్టు ప్రాంతా ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏటా నగ రం వరదల బారిన పడుతున్నా బల్దియా అధికారులు మాత్రం శాశ్వత ముంపు నివారణ పనులు చేపట్టడంలో విఫలమవుతున్నారు. వరుసగా రెండేళ్లు నగరం ముంపునకు గురవుతున్నా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగరానికి శాశ్వత ముంపు నివారణ కోసం రూ. 250 కోట్లతో చేపట్టిన పనులను పూర్తిచేయక పోవడంతో ఈసారి కూడా మునుగుడేనా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
