రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ను వీడుతున్నారు.

హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి రాజిరెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీనికోసం చెన్నూరు నియోజకవర్గం నుంచి హైదరాబాద్కు తన అనుచరులతో కలిసి వందలాది వాహనాల్లో హైదరాబాద్కు బయల్దేరారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
