
డిసెంబర్ 15 (శ్రీరామ్ చక్రి న్యూస్,)రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ , జిల్లెలగూడ చందన చెరువు వద్ద రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి విగ్రహాన్ని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, TUFIDC చైర్మన్ చల్ల నరసింహారెడ్డి పాల్గొన్నారు.

ఎమెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, “వెంకట్రామిరెడ్డి అందించిన సేవలు సమాజం మర్చిపోలేదని, వారి అడుగుజాడలో నడవాలని” ఆకాంక్షించారు. మహానీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు చేసినప్పుడే, వారి చేసిన సమాజ సేవలను ప్రజలు గుర్తించే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
TUFIDC చైర్మన్ చల్ల నరసింహారెడ్డి, మాట్లాడుతూ “దేశ చరిత్రలో వెంకట్రామిరెడ్డి సేవలు గుర్తింపబడతాయని” అన్నారు. చెరువు కట్టపై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రెడ్డి సంఘం నాయకులను అభినందిస్తూ, రాజకీయాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన సేవలను భవిష్యత్తులో కొనసాగిస్తామని తెలిపారు.
చల్ల నరసింహారెడ్డి పేర్కొన్నట్టుగా, “ప్రపంచంలో ఆయన చేసిన సేవలను ఎవరు మర్చిపోలేరు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం భావితరాలకు దిక్సూచి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నాయకులు ప్రజలు, కార్యక్రమంలో పాల్గొన్నారు
