
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందమాల పరమేశ్వర్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కప్పర సాయి గౌడ్ తెలిపారు.
డివిజన్ పరిధిలోని నాచారం బాబా నగర్లో గత ఎన్నో రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరమేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సంబంధిత అధికారులతో చర్చించి రూ.22 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు మంజూరు చేయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సాయి గౌడ్ మాట్లాడుతూ, ఉప్పల్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న బస్తీ బాట కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వరమే పరిష్కరిస్తుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో నాచారం డివిజన్ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్, కృష్ణారెడ్డి, దంతూరి రాజు గౌడ్, కొయ్యూరు బాలరాజ్, పర్వతాలు, పసియుద్దీన్, నందులాల్, ఉపేందర్ రెడ్డి, కళావతి, శైలజ, లావణ్య, జయంత్, పర్వేజ్, ఇంతియాజ్‌తో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు.
