మోదీ, పుతిన్, జిన్‌పింగ్.. మాత్రమే ఇరాన్ యుద్ధాన్ని ఆపగలరని అమెరికా ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్చ్ తెలిపారు. ప్రపంచ వినాశనాన్ని వీళ్లు మాత్రమే అడ్డుకోగలరన్నారు. ఈ ముగ్గురి నేతల శక్తియుక్తులు, సామర్థ్యం ఆపారమైందని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ: పశ్చిమాసియా సంక్షోభం యావత్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై చేస్తున్న దాడి ఆర్థిక సమస్యలు సృష్టిస్తున్నది. అయితే ప్రపంచ గమనాన్ని మార్చుతున్న ఇరాన్ యుద్ధాన్ని ఆపే శక్తి మోదీ, పుతిన్, జిన్పింగ్లకు మాత్రమే ఉన్నట్లు అమెరికా ఆర్థికవేత్త, ప్రొఫెసర్ జెఫ్రీ సాచ్స్ తెలిపారు. ప్రపంచ విధ్వంసాన్ని వీళ్లు మాత్రమే అడ్డుకోగలరని ఆ ప్రొఫెసర్ చెప్పారు. న్యూఆర్డర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఆ ముగ్గురు నేతలకు మంచి గుర్తింపు ఉన్నదని, వాళ్లు ఎంతో పరిణితి చెందిన వ్యక్తులు అని, అయితే ప్రస్తుత సంక్షోభాన్ని మోదీ, పుతిన్, జిన్‌పింగ్ అడ్డుకోగలరన్నారు. అమెరికా దూకుడును ఈ ముగ్గురు నేతలు ఆపగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
