కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట-కొల్చారం మండలాల్లోని వనదుర్గా (ఘనపూర్) ప్రాజెక్టు ఆనకట్ట పెంపును రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట-కొల్చారం మండలాల్లోని వనదుర్గా (ఘనపూర్) ప్రాజెక్టు ఆనకట్ట పెంపును రేవంత్ సర్కారు పట్టించుకోవడం లేదు. ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచితే రైతుల భూములు నీట మునుగుతాయి. భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు మంజూరయ్యాయి. బీఆర్ఎస్ హయాంలోనే వనదుర్గా ప్రాజెక్టు ఆధునీకరణ కోసం ప్రభుత్వం రూ. 43.64 కోట్ల నిధులు మంజూరు చేసింది. నీటిపారుద శాఖ ఇంజినీరింగ్ అధికారులు టెండర్లు ఖరారు చేసి కాంట్రాక్టరుకు పనులు అప్పుగించారు.
