మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేశారు.

నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల ఉమ్మడి నాయకులంతా కలిసి ఇవాళ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించడాన్ని మెచ్చుకున్నారు. ‘దాదాపు నాలుగైదు కిలోమీటర్లు ర్యాలీ తీశారు. నాకు ఆ ర్యాలీని చూస్తావుంటే 2028 ఎలక్షన్ అయిపోయింది.. మనం గెలిచినాము.. కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అయినారు అన్నట్లుగా అనిపించింది’ అన్నారు. ఆరేడు వేల మోటార్ సైకిళ్లతోటి బ్రహ్మాండంగా ర్యాలీ తీసిండ్రని పార్టీ శ్రేణులను ప్రశంసించారు.
